Sunday, May 17, 2026
E-PAPER
Homeక్రైమ్వారాసిగూడలో నకిలీ వైద్యుడు అరెస్ట్

వారాసిగూడలో నకిలీ వైద్యుడు అరెస్ట్

- Advertisement -

 భారీగా ఇంజక్షన్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఎలాంటి అర్హత లేకుండా అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తూ..నకిలీ వైద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడిని వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వారాసిగూడ పరిధిలో “మాధవ మెడికల్ షాప్” పేరుతో సాగుతున్న ఈ అక్రమ ధందాను పోలీసులు పక్కా ప్లాన్‌తో చేదించారు. అరెస్ట్ అయిన నిందితుడిని నన్నుట మాధవ్ (42) ప్రస్తుతం వారాసిగూడ నివసిస్తున్నాడు. ఈయన స్వస్థలం భూపాలపల్లి) గా పోలీసులు గుర్తించారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నిందితుడికి ఎలాంటి వైద్య ( మెడికల్ ) లేదా ఫార్మసీ ( ఫార్మసీ) అర్హతలు లేవు.

నిందితుడు నన్నుట మాధవ్ అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాడు. తనకు ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ, కుంట అర్చన అనే తన స్నేహితురాలికి చెందిన డ్రగ్ లైసెన్స్‌ను అడ్డం పెట్టుకుని అక్రమంగా వైద్యం ప్రాక్టీస్ ప్రారంభించాడు. గత ఏడాది కాలంగా రోగులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా చికిత్సలు అందిస్తున్నాడు.

పోలీసుల డెకాయ్ ఆపరేషన్ – అరెస్ట్ : ఈ అక్రమ ప్రాక్టీస్‌పై ఖచ్చితమైన సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు రంగంలోకి దిగి ఒక వ్యూహాత్మక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ముఫ్తీలో (సాధారణ దుస్తులలో) ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్‌ను రోగిగా నిందితుడి వద్దకు పంపారు. నిందితుడు సదరు హెడ్ కానిస్టేబుల్‌కు ఇంజక్షన్ ఇవ్వబోతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాను గత ఏడాది కాలంగా అర్హత లేకుండా రోగులకు వైద్యం చేస్తున్నానని, ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా  (డైక్లోఫెనాక్), టిటి (టెటానస్ టాక్సాయిడ్) వంటి షెడ్యూల్డ్ ఇంజక్షన్లు ఇస్తున్నట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. నిందితుడి ఒప్పుకున్న ప్రకారంగా వారాసిగూడ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆ షాప్ నుండి అక్రమంగా నిల్వ ఉంచిన టిటి ఇంజక్షన్ వైల్స్ మరియు ఈ అక్రమ వ్యాపారానికి ఉపయోగిస్తున్న ఒక ‘శామ్‌సంగ్’ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వారాసిగూడ పోలీసుల ప్రజలకు హెచ్చరిక, విజ్ఞప్తి
ఎలాంటి మెడికల్ క్వాలిఫికేషన్ లేకుండా నకిలీ వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు సైతం తమ ఆరోగ్య విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, కేవలం అర్హత కలిగిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, గుర్తింపు పొందిన ఆసుపత్రులలో మాత్రమే చికిత్స చేయించుకోవాలని వారాసిగూడ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -