- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ గత కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, ప్రేక్షకుల్లో ఆ సినిమాలు పూర్తి సంతృప్తిని కలిగించలేకపోయాయి. మాస్ ఇమేజ్‌కు కాస్త విరామం ఇచ్చి, క్లాస్ టచ్‌తో చేసిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కూడా సంక్రాంతి బరిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో రవితేజ తదుపరి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.ఈ క్రమంలోనే ఆయన దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
- Advertisement -



