నవతెలంగాణ – బాల్కొండ
77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాల్కొండ మండల పరిధిలోని గ్రామాలలో వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, యువజన సంఘాలు, వివిధ పార్టీ కార్యాలయాలు,ప్రధాన కూడళ్ల వద్ద మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. బాల్కొండ తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ విజయ భాస్కర్ రెడ్డి ,పోలీస్ స్టేషన్ వద్ద సీఐ గడ్డం జాన్ రెడ్డి, ఇరిగేషన్ కార్యాలయం వద్ద డి ఈ సురేష్, కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ స్రవంతి, వివిధ గ్రామపంచాయతీ కార్యాలయల వద్ద గ్రామ సర్పంచ్ లు, ఆదర్శ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ,వివిధ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ళు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకం ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బాల్కొండలో కన్నుల పండుగగా గణతంత్ర వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



