Monday, January 26, 2026
E-PAPER
Homeజాతీయంలౌకికవాదాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా ఐక్యం కావాలి: పినరయి విజయన్

లౌకికవాదాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా ఐక్యం కావాలి: పినరయి విజయన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: లౌకికవాదం, సమాఖ్య వాదాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం పిలుపునిచ్చారు. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, రాజ్యాంగ విలువలైన లౌకికవాదం, సమాఖ్య వాదాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని విజయన్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాదం, ఫెడరలిజం సూత్రాలను అణిచివేసేందుకు కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా యత్నిస్తున్నప్పటికీ, భారతదేశ సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన గర్వకారణమైన జ్ఞాపకాలను ఈ రోజు పునరుద్ధరించిందని అన్నారు. రాజ్యాంగమంటే కేవలం చట్టపరమైన పత్రం కాదని, భిన్నత్వాన్ని గౌరవించే, సమాన న్యాయానికి హామీ ఇచ్చే భారతదేశ ఆలోచనకు ఆత్మ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -