- కత్తి, రాడ్లలతో దాడి
నవతెలంగాణ-మిర్యాలగూడ: పట్టణంలోని రవీందర్ నగర్‌లో కోళ్ల మధ్య జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి పై పొరుగింటి వ్యక్తులు కత్తి, రాడ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో రామచంద్ర రెడ్డి తన ఇంటి వద్ద ఉండగా, పక్కింటి యజమాని శనిగారపు పాపయ్య ఆయన భార్య కరుణకు చెందిన కోళ్లు రామచంద్ర రెడ్డి పెరట్లోకి వచ్చి.. ఆయన పెంచుకున్న ఆకుకూరలు, మొక్కలను తినడంతో వాటిని వెళ్లగొట్టారు. ఈ విషయమై మాట్లాడేందుకు రామచంద్ర రెడ్డి పాపయ్య ఇంటి ముందు వెళ్లగా, పాపయ్య, ఆయన భార్య కరుణ వారి కుమారుడు కలిసి గొడవకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో రామచంద్ర రెడ్డి ఆయన భార్యపై కత్తితో దాడి చేసి, రాడ్లతో తలపై, ఎడమ భుజంపై కొట్టినట్లు తెలిపారు. రామచంద్ర రెడ్డి ఎడమచేతి మనికట్టు వద్ద గాయపడినట్లు పేర్కొన్నారు. వారి అరుపులు విన్న రామచంద్ర రెడ్డి బావగారైన నంద్యాల వేణుగోపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని గొడవను ఆపేందుకు ప్రయత్నించగా, అతనిపై కూడా రాడ్లతో తలపై కొట్టడంతో రక్త గాయమైంది.ఈ ఘటనపై బాధితులు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.




