- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ములుగు జిల్లాలో పోలీసుల గన్ మిస్‌ఫైర్ కావడంతో ఇద్దరు సీఆర్‌పిఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వాజేడు పోలీస్ స్టేషన్‌లోని సీఆర్‌పిఎఫ్ క్యాంపులో UGBL అనే కొత్త రకం గన్ క్లీన్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మిస్ ఫైర్ ఐనట్లు సమాచారం. దీంతో ఇద్దరు జవాన్లకు వీపు, భుజం, నడుము భాగాల్లో గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ములుగు వైద్యశాలకు డాక్టర్లు రెఫర్ చేసినట్లు సమాచారం.
- Advertisement -



