నవతెలంగాణ-హైదరాబాద్: మంగళవారం గోవాలో జరుగుతున్న భారత ఇంధన వారోత్సవాలకు కెనడా ఇంధన శాఖా మంత్రి టిమ్ హోడ్గ్సన్ హాజరయ్యారు. ఈ వారోత్సవాల్లో పాల్గొన్న టిమ్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్లలో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కెనడా భారత్‌తో వాణిజ్యాన్ని పెంచుకుంటుంది అని ఆయన అన్నారు. ఇరు దేశాలు ఇంధన సహకార మద్దతుకు ఈ వారోత్సవం మంచి అవకాశమని ఆయన అన్నారు.
కాగా, ఇండియాలో ఎనర్జీ వీక్‌లో తాను పాల్గొంటున్నాని, ఈ సందర్భంగా తాను తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్నట్లు.. టిమ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల్లో కెనడా- భారత్‌లు ఇంధనంపై చర్చలు జరపలేదు. ఈ ఇంధన వారోత్సవాల ద్వారా మొదటిసారిగా ఇరుదేశాలు ఇంధనంపై చర్చలకు ఉపయోగపడనుందని ఆయన అన్నారు. కెనడా ఎనర్జీ సూపర్ పవర్ కావాలనుకుంటే.. మా ఇంధనం, సహజ వనరులతో ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన మార్కెట్లలో ఒకటైన భారతదేశంతో వ్యాపారం చేయాలి’ అని టిమ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.



