- Advertisement -
సింగవరం-1 గ్రామ సర్పంచ్ గొంగోళ్ల ఈశ్వర్
నవతెలంగాణ – అలంపూర్
అలంపూర్ మండల పరిధిలోని సింగవరం(1) గ్రామానికి నిరంతరాయంగా మిషన్ భగీరథ నీరు సరఫర చేయాలని మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ గొంగోళ్ల ఈశ్వర్ అడిషనల్ కలెక్టర్ నర్సింగ్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొంగోళ్ల ఈశ్వర్ మాట్లాడుతూ .. గ్రామానికి వారంలో కనీసం రెండు మూడు రోజులు నీరు రావడం లేదని, నీళ్లు వచ్చిన రోజు కూడా గ్రామ ప్రజలకు తగినన్ని నీళ్లు రావడంలేదని అడిషనల్ కలెక్టర్ నర్సింగ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రత్నకుమారి, టి.మధురవాణి ఉన్నారు.
- Advertisement -



