విద్యార్థులకు సర్టిఫికెట్ ఫైల్స్ పంపిణీ
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
విద్యార్థులు మంచి క్రమశిక్షణ అలవర్చుకొని, కష్టపడి చదివినప్పుడే భవిష్యత్తులో రాణిస్తారని లయన్స్ క్లబ్ ఆఫ్ కింగ్స్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మందఅశోక్ పేర్కొన్నారు. మంగళవారం లయన్స్ క్లబ్ కింగ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొలిపురలో 10వ తరగతి విద్యార్థులకు “ఫైల్స్” ను అందజేశారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రన్ దేవ్ నగర్ లో 45 మంది విద్యార్థులకు ఫైల్స్ అందజేశారు. “లయన్స్ ఇంటర్నేషనల్” సమాజ సేవయే పరమావధిగా పనిచేస్తుందని ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల కోసం లైన్స్ క్లబ్ కింగ్స్ వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు.
ముఖ్యంగా స్టూడెంట్ కిట్స్, బుక్స్, నోట్ బుక్స్, కంపాస్ బాక్స్, పెన్స్, బెల్ట్, టై, షూస్ ఆరోగ్య పరీక్షలు, వైద్యం కోసం ఆర్థిక సహాయం, క్రీడా పరికరాలు, ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహకారం ఇలా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ మెంబర్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్, డిస్టిక్ కోఆర్డినేటర్, ఎంజెఎఫ్ రమకాంతరావు రమాకాంత్ రావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో స్థిరపడి, తమలాగా సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనాలని తద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ భగవాన్దాస్ దుర్గే, సీనియర్ సభ్యులు కరీం అలీ నూరానీ, రంగు ప్రేమ రాజ్ గౌడ్, యాళ్ల ఆనంద్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నయ్యర్ జాన్ ఆరా బేగం, మురళి, బెజ్జంకి రవీంద్ర, శేఖర్, సంజీవరావు, భీమ్రావు రుబీనా, పాండురంగ, కన్య మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.


