- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆల్లూరి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.5,600 అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని అతి కిరాతకంగా చంపి సజీవదహనం చేశారు. పాడేరు మండలం అయినాడ పంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామానికి చెందిన వృద్ధుడు సోమన్న.. రామారావుకు కొంత నగదు అప్పు ఇచ్చాడు. బాకీ తీర్చమని అడిగినందుకు ఆగ్రహించిన రామారావు కిరాతకంగా వ్యవహరించాడు. సోమన్నపై దాడి చేసి ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటనలో వృద్ధుడు సజీవదహనమయ్యాడు. నిందితుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పాడేరు పోలీసులు తెలిపారు.
- Advertisement -



