- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కొన్ని నెలలుగా ధరలు లేక ఇబ్బందులు పడిన కొబ్బరి రైతులకు ఊరట లభించింది. తెలంగాణలో మేడారం జాతర, వరుస శుభకార్యాల ప్రభావంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. వారం కిందటి వరకు వెయ్యి కాయల ధర రూ.15 నుంచి16వేలు ఉండగా ఇప్పుడు రూ.19 నుంచి 20 వేలకు చేరింది. ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల నుంచి రోజూ 70 లారీల సరుకు ఎగుమతి అవుతోంది. ఇక కురిడీ కొబ్బరిలో పెద్ద రకం రూ.32,500, చిన్నకాయ రూ.29,000 వరకు పలుకుతోంది.
- Advertisement -



