- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారు. తన అభిమానులకు ఊహించని షాక్ ఇస్తూ, సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. “ఇకపై నేను ప్లేబ్యాక్ సింగర్‌గా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం లేదని ప్రకటిస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం. భవిష్యత్‌లో ఒక చిన్న కళాకారుడిగా మరింత నేర్చుకుని నా సొంతంగా మరిన్ని పనులు చేస్తాను. నేను ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్న పనులు(పాటలు) పూర్తి చేయాల్సి ఉంది. వాటిని కంప్లీట్ చేస్తాను. ఈ ఏడాది మీరు కొన్ని పాటలను నా నుంచి చూడొచ్చు. అదే సమయంలో నేను సంగీతం చేయడం ఆపనని స్పష్టం చేయాలనుకుంటున్నాను” అని ఆయన తెలిపారు.
- Advertisement -



