- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వన దేవతల మేడారం మహా జాతర నేటితో మొదలై నాలుగు రోజుల పాటు జరగనుంది. ఒక్కో రోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మార్మోగనుంది. ఇవాళ సారలమ్మ, సమ్మక్క భర్త పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై కొలువుదీరనున్నారు. రేపు చిలకల గుట్టపై నుంచి కుంకుమభరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. జాతర నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
- Advertisement -



