Wednesday, January 28, 2026
E-PAPER
Homeక్రైమ్మేడారం వెళ్తున్న భక్తుల ట్రాక్టర్‌ బోల్తా..ఇద్దరు భక్తులు మృతి

మేడారం వెళ్తున్న భక్తుల ట్రాక్టర్‌ బోల్తా..ఇద్దరు భక్తులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన సుమారు 20 మంది భక్తులు ట్రాక్టర్‌లో మంగళవారం ఉదయం జాతరకు బయలుదేరరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిదికి మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -