- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మళను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్ అయ్యారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే 500 రెట్లు ఆదాయం వస్తుందని సైబర్ నేరగాళ్లు ఆశ చూపారు. DEC 24 నుండి జనవరి 5 వరకు 19 విడతలుగా రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టించి రూ.2 కోట్లు లాభం వచ్చినట్లుగా నమ్మించారు. విత్ డ్రా చేసుకోవాలంటే మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేరానికి పాల్పడ్డ బిహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -



