Wednesday, January 28, 2026
E-PAPER
Homeజాతీయంవిమాన ప్రమాదం.. అజిత్‌ పవార్‌ దుర్మరణం

విమాన ప్రమాదం.. అజిత్‌ పవార్‌ దుర్మరణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. పుణె జిల్లాలోని బారామతిలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలడంతో అజిత్‌ తుదిశ్వాస విడిచినట్లు పీటీఐ తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ఈ విమానం బుధవారం ఉదయం ముంబై నుంచి బయలుదేరింది. సుమారు గంట ప్రయాణం తర్వాత, 9 గంటల సమయంలో బారామతి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి కుప్పకూలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బారామతిలో జరగనున్న నాలుగు ముఖ్యమైన బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈరోజు అక్కడికి వెళుతున్నారు. ప్రమాద స్థలం నుంచి వస్తున్న దృశ్యాల్లో మంటలు, దట్టమైన పొగ కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -