- Advertisement -
నవతెలంగాణ – ఖమ్మం: ఈ రోజు ఉదయం 5 గంటలకు సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వివరాలోకి వేలితే.. ఖమ్మం నగరంలోని 28వ డివిజన్ కాల్వ కట్ట ఇండ్లను అధికారులు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలను అడ్డుకున్న సీపీఐ(ఎం) త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా రంజిత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనులను పోలీసులు ఉదయం వారి ఇండ్లల్లో నిర్బంధించారు.
- Advertisement -



