నవతెలంగాణ-హైదరాబాద్: యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) పునరుద్ధరణకు ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామని కాంగ్రెస్ పేర్కొంది. ఈ చట్టాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేసేందుకు ప్రతిపక్షాలు అన్ని ప్రజాస్వామ్య మార్గాలను వినియోగిస్తాయని తెలిపింది. బుధవారం పార్లమెంట్ బడ్టెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ బుల్డోజర్ రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ‘వాపస్ లో (వెనక్కి తీసుకోవాలి)’ అంటూ నినాదాలు చేపట్టాయి. రాష్ట్రపతి సూచించిన విబి-జిరామ్‌జి చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విబి-జిరామ్‌జి చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను పనిచేసే హక్కు, పంచాయితీల అధికారం హక్కుల ఆధారిత చట్టంగా దాని అసలు రూపంలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశాయి.
వీబీ-జిరామ్‌జి చట్టాన్ని ఉపసంహరించుకోవాలి: కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



