-మొక్కులు చెలిస్తున్న భక్తులు
-నవతెలంగాణ-పెద్దవూర : చిన మేడారం పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర 2026, జనవరి 28న అట్టహాసంగా ప్రారంభమైంది.నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పవిత్ర కృష్ణానది తీరం పొట్టిచేలిమ వద్ద కొలువైన సమ్మక్క-సారక్క అమ్మవార్ల గద్దెలపైకి సారలమ్మ ఆగమనంతో జాతర బుధవారం ఘట్టం మొదలైంది. వందలాది మంది భక్తులు ‘బంగారం’ (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. ఈజాతార ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగ నున్నాయి. బుధవారం కన్నెపల్లి నుండి సారలమ్మ గద్దెపైకి,29న చిలుకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెపైకి రానున్నారు.ఈ జాతరకు నల్గొండ,పల్నాడు, గుంటూరు జిల్లా లనుంచి భారీగా భక్తలు వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తారు.మొదటి రోజు బుధవారం అమ్మవార్లకు ఆలయ అధ్యక్షురాలు గుంజా అంజమ్మ,కార్యదర్శ నాగపురి లక్ష్మి, ఆర్గనైజేషన్ కృష్ణంరాజు,జాతర ముఖ్య నిర్వహకులు నాగపురి వెంకట పతిరాజు,సాంభశివ, ప్రియదర్శిని వానదేవతలకు నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అట్టహసంగా ప్రారంభమైన సమ్మక్క-సారక్క జాతర..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



