గ్రామాలకు కాటన్ల కొద్దీ మద్యం సరఫరా
పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల పరిధిలోని వైన్ షాప్స్ యాజమాన్యం ఎక్సైజ్ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా గ్రామాలకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఒక వ్యక్తికి 1 నుంచి 3 బాటిల్స్ మాత్రమే ఇవ్వాలనే నిబంధనను వారు పూర్తిగా గాలికి వదిలేశారు. గ్రామాలలో బెల్ట్ షాపులను నిర్వహించే వారికి వీరు అడ్డూ అదుపూ లేకుండా మాకు డబ్బులొస్తే చాలు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్కరికి కాటన్ల కొద్దీ మద్యాన్ని విక్రయిస్తున్నారు. పల్లెటూర్లలో 24/7 మందు బాబులు తాగి ఊగుతున్నారంటే ఏ విధంగా అమ్మకాలు జరుగుతున్నాయో ఆలోచించండి. అంతేకాదు రాత్రీ పగలు తేడా లేకండా మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవలు కూడా గ్రామస్తులు పెంచుకుంటున్నారు. ఈ విషయమై పత్రికల్లో ఎన్నోసార్లు కథనాలు వెలువడినా అధికారులు నిమ్మకునీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో స్తానికులు అధికారుల కళ్ళను కాకులు పొడిచాయా అని విమర్శిస్తున్నారు. ప్రతిరోజూ గ్రామాలకు వైన్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి అధిక మద్యం సరఫరాను అరికట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ బిచ్కుంద సీఐ పవన్ గౌడ్ ను నవతెలంగాణ మద్యం విషయమై వివరణ కోరగా.. బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
నిబంధనలను తుంగలో తొక్కిన వైన్ షాప్ యాజమాన్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



