– ప్రధమ ఛైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థే
– దోసె వేసి,ప్రచారం చేసిన
– ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మున్సిపాల్టీ పీఠం అధికార పార్టీదేనని,ప్రధమ ఛైర్పర్సన్ గా ఎన్నికయ్యే ది కాంగ్రెస్ అభ్యర్థులే నని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ధీమా వ్యక్తం చేసారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బుధవారం మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు.
ఈ సందర్భంగా ఒక హోటల్ లో దోసె వేసి,ప్రచారం నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాహిత పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థులకు అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఏర్పడిన విశ్వాసం కారణంగా విపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానిస్తూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు అవలంబించాల్సిన విధి విధానాలపై విస్తృతంగా చర్చించారు.
గత అనుభవాలను విశ్లేషిస్తూ లోటుపాట్లను సరిదిద్దుకునే దిశగా కార్యాచరణ రూపొందించి ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.



