– మాజీ ఎమ్మెల్యే మెచ్చా హయాంలో నే అశ్వారావుపేట అభివృద్ది
– మున్సిపాల్టీ ఎన్నికల బీఆర్ఎస్ ఇంచార్జీ వెంకటరమణ
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మున్సిపాల్టీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హయాంలో నే అశ్వారావుపేట లో అభివృద్ధి జరిగిందని మున్సిపాల్టీ ఎన్నికల బీఆర్ఎస్ ఇంచార్జి ఉప్పల వెంకట రమణ ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం ఆయన మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ నియోజక వర్గం ఇంచార్జి మెచ్చా నాగేశ్వరరావు తో కలిసి అశ్వారావుపేట లో ముఖ్య నాయకుల,కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఆయన పరిచయం చేసుకుని,వారితో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం
కేసీఆర్ హయాంలో,మెచ్చా నాగేశ్వరరావు కృషితో అశ్వారావుపేట మున్సిపాలిటీగా మారిందని, 100 పడకల ఆసుపత్రి, ఆర్టీవో ఆఫీస్, సెంట్రల్ లైటింగ్, డిగ్రీ కాలేజీ వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. అనంతరం మెచ్చా మాట్లాడుతూ పార్టీ తరుపున పోటీ చేసే వారు అందరూ విజయం సాధించడం ఖాయమన్నారు.తాను తెచ్చిన నిధులను కూడా సరిగ్గా ఉపయోగించడం లేదని నాణ్యత లేని పనులు చేస్తూ నిధులు దుర్వినియోగ చేస్తున్నారని,2 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని,420 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని,ఈ విషయాలని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని,ఓటర్లు బీఆర్ఎస్ కే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో ప్రతి గడపకు ప్రచారం నిర్వహిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జుజ్జూరపు వెంకన్న బాబు, ఛైర్పర్సన్ అభ్యర్ధిని కాసాని నాగ శేష పద్మ,చంద్రమోహన్,జెడ్పీటీసీ మాజీ సభ్యులు జేకేవీ రమణారావు, పద్మజ, వగ్గెల పూజ, సత్యవరపు సంపూర్ణ,మోటూరి మోహన్ లు పాల్గొన్నారు.



