Wednesday, January 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదు 

పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదు 

- Advertisement -

– ఎంఏ ఏజాజ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు 
నవతెలంగాణ-ఆలేరు : పదేళ్ల బి ఆర్ ఎస్  పాలనలో ఆలేరు పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం ఏ ఎజాజ్ అన్నారు.ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆలేరు మున్సిపాలిటీ కౌన్సిలర్లగా పోటీ చేసే అభ్యర్థులతో సన్నాహక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు నూతనంగా ఏర్పడిన ఆలేరు మున్సిపాలిటీ అవినీతి మయం చేశారని విమర్శించారు.పేదవారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను 1,50,000 చొప్పున అక్రమంగా తమకు అనుకూలమైన వారికి ఇచ్చిన విషయం ఆలేరు ప్రజలు మర్చిపోరు అన్నారు.పదేళ్లలో మైనార్టీలకు కేవలం 2 ఇండ్లు మాత్రమే వచ్చాయన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ఈ రెండేళ్లలో మైనార్టీ సోదరులకు 64 ఇండ్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున మంజూరయ్యాయి అన్నారు.ఆలేరులో బలమైన సామాజిక వర్గమైన చేనేత పవర్ లూమ్ కార్మికులను ఓటు బ్యాంకుగా మాత్రమే బి ఆర్ ఎస్ పార్టీ చూసిందన్నారు.నేత అన్న ల బాధ తెలుసుకున్న వెంటనే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య మంత్రి తో మాట్లాడి రుణమాఫీ చేయించిన విషయం ఆ సామాజిక వర్గం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి తెలియజేస్తుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు పట్టణానికి 15 కోట్లు సిసి రోడ్లు కల్వట్లు వివిధ అభివృద్ధి పనుల కేటాయించారు.నూతన పాలకవర్గం ఏర్పడగానే ప్రతి వార్డుని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.మైనార్టీలకు ఈద్గా వద్ద తొమ్మిది లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ కు నిధులు ఎమ్మెల్యే కేటాయించారని,అదే విధంగా సొంత డబ్బులతో ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా కూర్చోవడానికి అనుకూలంగా ప్రార్థన జరుపుకునే స్థలంలో సీ.సీ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసిన విషయాలు మైనార్టీ సోదరులు మర్చిపోరు అన్నారు.ఆలేర్ పట్టణంలో ప్రతి వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి వార్డులో 150 మందికి రేషన్ కార్డులు తోపాటు ఇందిరమ్మ ఇండ్లు సీఎం రిలీఫ్ ఫండ్ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి సన్న బియ్యం ఉచిత విద్యుత్తు లాంటి పథకాలతో ప్రజాలపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యకు ఆలేరు లోని 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులను కాంగ్రెస్ సన్మానించారు.బుధవారం నాడు అందరు నామినేషన్ వేసి ప్రజల్లోకి వెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో టి సి పి కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరి,మాజీ సర్పంచ్ బీర్ల శంకర్,జిల్లా పార్టీ నుండి పరిశీలకులుగా వచ్చారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం పద్మ వెంకటస్వామి,కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి,ఎగ్గిడి శ్రీశైలం,ఎండి జైనుద్దీన్,ఎం ఎస్ విజయకుమార్ లతో పాటు పోటీ చేస్తున్న 12 వార్డుల  కౌన్సిలర్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -