–వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ – అశ్వారావుపేట : స్థానిక వ్యవసాయ కళాశాల లో ఈ నెల 30 వ తేదీ నుండి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు (30-01-2026 నుండి 01-02-2026 వరకు) పీజేటీఏయూ(ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన బోధనేతర సిబ్బందికి క్రీడా, ఆటల,సాహిత్య,సాంస్కృతిక పోటీలను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ బుధవారం ప్రకటించారు.
ఈ పోటీల ద్వారా ఉద్యోగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభ,సృజనాత్మకత, సాంస్కృతిక నైపుణ్యాలను వెలికి తీయడం లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో రాష్ట్రంలోని పలు కళాశాలలకు చెందిన బోధనేతర సిబ్బంది పాల్గొంటారని ఆయన తెలిపారు.



