Wednesday, January 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు వస్తువుల వితరణ

పాఠశాలకు వస్తువుల వితరణ

- Advertisement -

నవతెలంగాణ బాల్కొండ : మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన 2015 -2016 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు పాఠశాలకు తమ వంతు సహకారంగా కార్డ్ లెస్ మైక్ సెట్, కార్పెట్లు, చెమ్మెలు మొత్తం పదివేల రూపాయల విలువ చేసే వస్తువులను బుధవారం ఉపాధ్యాయులకు అందజేశారు.   ఈ నేపథ్యంలో  పాఠశాల పట్ల తమకున్న భక్తి భావనను చాటుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో  శ్రీనివాస్, నర్సారెడ్డి, భృగు మహర్షి, రామారెడ్డి, శ్రీనివాస్,పద్మ, ప్రవీణ్, రాజేందర్ గౌడ్  విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -