Wednesday, January 28, 2026
E-PAPER
Homeఆదిలాబాద్30న మండల స్థాయి సీఎం కప్ పోటీలు..

30న మండల స్థాయి సీఎం కప్ పోటీలు..

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలానికి సంబంధించి 2025–26 సంవత్సరానికి గాను మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లవకుమార్ ఒక ప్రకటన లో  తెలిపారు.

ఈ పోటీలు ఈనెల 30 వ తేదీన రోజున ఉదయం 9.30 గంటలకు ముధోల్ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానంలో జరగనున్నాయని పేర్కొన్నారు. మండల పరిధిలోని ఐదు క్లస్టర్ల నుంచి మండల స్థాయికి ఎంపికైన క్రీడాకారులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

మండల స్థాయికి ఎంపికైన క్రీడాకారులు అందరూ 30వ తేదీ ఉదయం 9 గంటలకు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో హాజరై రిపోర్ట్ చేయాలని కోరారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాలకు చెందిన ఎంపికైన క్రీడాకారులు తప్పనిసరిగా పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని ఎంపీడీవో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -