- Advertisement -
నవతెలంగాణ – వేములవాడ : వేములవాడ అర్బన్ మండల తహసిల్దార్‌గా ఆకారపు జయంత్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తంగళ్లపల్లి మండల తహసిల్దార్‌గా విధులు నిర్వహించిన ఆకారపు జయంత్ బదిలీపై వేములవాడకు వచ్చారు.
ఇదే సమయంలో వేములవాడలో తహసిల్దార్‌గా పనిచేస్తున్న విజయ్ ప్రకాష్ రావు తంగళ్లపల్లి మండల కేంద్రానికి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తహసిల్దార్ ఆకారపు జయంత్ కార్యాలయ సిబ్బందితో పరిచయ సమావేశం నిర్వహించి, మండలంలోని పరిపాలనా వ్యవహారాలపై అవగాహన పొందారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో, పారదర్శకంగా అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


