Wednesday, January 28, 2026
E-PAPER
Homeఆటలుటాస్ గెలిచిన ఇండియా

టాస్ గెలిచిన ఇండియా

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: ఆంధ్ర‌ప్రదేశ్ విశాఖ వేదిక‌గా ఇండియా,న్యూజిలాండ్ జ‌ట్లు మ‌ధ్య కాసేప‌ట్లో నాల్గో టీ20 జ‌ర‌గ‌నుంది. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వ‌రుస విజ‌యాల‌తో ట్రోఫిని సూర్య‌సేన కైవ‌సం చేసుకొని 3-0తో ముందంజ‌లో ఉంది. అంతక ముందు వ‌న్డే సిరీస్‌ను కీవీస్ ద‌క్కించుకుంది.

హ్యాట్రిక్‌ విజయాలతో తిరుగులేని జోరుమీదున్న టీమ్‌ ఇండియా నేడు విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌తో నాల్గో టీ20లో బరిలోకి దిగుతోంది. టీ20 ప్రపంచకప్ నేప‌థ్యంలో జ‌ట్టులో మార్పులు చేయ‌డానికి టీమిండియా స‌న్నాహాలు చేస్తుంది.గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ నేడు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బౌలింగ్‌ లైనప్‌లో పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రాకు నేడు విశ్రాంతి లభించే సూచనలు ఉన్నాయి. అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రానాలు పేస్‌ బాధ్యతలు పంచుకోనుండగా.. కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌ విభాగం చూసుకోనున్నారు.

మ‌రోవైపు వన్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న‌ న్యూజిలాండ్.. అదే జోరును టీ20 సిరీస్‌లో కొన‌సాగించ‌లేక‌పోయింది. గ్లెన్‌ ఫిలిప్స్‌, డార్లీ మిచెల్‌, మార్క్‌ చాప్‌మన్‌ బ్యాట్‌తో మరింత బాధ్యత తీసుకుంటే కివీస్‌ 200 ప్లస్‌ స్కోరు సాధించగలదు. జాకడ్‌ డఫ్ఫీ, ఇశ్‌ సోధి సహా కైల్‌ జెమీసన్‌లు భారత బ్యాటర్లను కట్టడి చేసేందుకు కొత్త ప్రణాళికలతో రావాలి. లేదంటే, విశాఖలోనూ కివీస్‌కు చేదు అనుభవం తప్పదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -