– మొదటి రోజు ముచ్చటగా మూడు నామినేషన్ లు దాఖలు
– బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా విశ్రాంత ఉపాధ్యాయుడు నామినేషన్
– పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణ రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ లో బుధవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ లో ముచ్చటగా మూడు నామినేషన్ లు దాఖలు అయ్యాయి. మూడో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా యూ.ఎస్ ప్రకాశ్ రావు, బీజేపీ అభ్యర్థి గా రాయుడు ఆంజనేయులు ,22 వ, వార్డు బీజేపీ అభ్యర్థి గా నార్లపాటి వీరాంజనేయులు నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ ఎన్నికల జిల్లా సహాయ అధికారి,స్థానిక మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు.
మూడో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఉపాధ్యాయుల సూర్యప్రకాశ్ రావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయుడు.ఈయన అశ్వారావుపేట మేజర్ పంచాయతీ చివరి పాలకవర్గం సభ్యులు గా పనిచేసారు. ఉపాధ్యాయుల సూర్యప్రకాశ్ రావు నామినేషన్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జెడ్పీటీసీ పూర్వ సభ్యులు జే కేవీ రమణారావు హాజరు అయ్యారు. బీజేపీ అభ్యర్ధుల నామినేషన్ లో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మెట్టా వెంకటేష్ పాల్గొన్నారు.



