నవతెలంగాణ-రాయికల్: పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో 3వ వార్డులో గత రెండు నెలల క్రితం మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తుల నిమిత్తం సీసీ రోడ్డును త్రవ్వి మరమ్మత్తులు చేపట్టేందుకు ఎలాంటి కాంట్రాక్టర్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజుకు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మూడో వార్డులోని ప్రధాన సీసీ రోడ్డుకు ఆనుకుని ప్రైమరీ పాఠశాల ఉండటంతో విద్యార్థులు స్కూల్కు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అలాగే అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే 108 అంబులెన్స్ వంటి వాహనాలు కూడా రాకుండా రోడ్డుపై గుంతలు తవ్వి అలాగే వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డుకు సమీపంలోనే రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ బూత్ కూడా ఉండటంతో సమస్య మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి,సీసీ రోడ్డు మరియు వాటర్ పైప్ లైన్ మరమ్మత్తుల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాలనీవాసులు కోరారు.
సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



