నవతెలంగాణ -పరకాల : మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో పట్టణంలో రాజకీయ కోలాహలం మొదలైంది. నామినేషన్ల స్వీకరణ తొలిరోజే పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన బిజేపి, కాంగ్రెస్తో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగారు.మున్సిపల్ ఎన్నికల బరిలో నిలుస్తూ ఈరోజూ తమ నామినేషన్ పత్రాలను సమర్పించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.7వ వార్డు నుండి నల్లెల అనిల్ కుమార్ తన నామినేషన్ దాఖలు చేశారు.16వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున వీర్ల శంకర్ నామినేషన్ వేయగా, బిజేపి తరపున మర్త రాజ భద్రయ్య తన పత్రాలను సమర్పించారు.
18వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బంటేరు కమల పోటీలో నిలిచారు. 20వ వార్డు నుండి బిజేపి తరపున పాలకుర్తి తిరుపతి నామినేషన్ దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తొలిరోజే నామినేషన్లు దాఖలు కావడంతో వార్డుల్లో అప్పుడే ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్లు అందజేశారు. రాబోయే రోజుల్లో ఈ పోటీ మరింత తీవ్రతరం కానుంది.



