– సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి : నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రం మున్సిపాలిటీ లోని 7, 8, 27 వార్డుల్లో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఓటు వేసిన వారికి ముఖం కూడా చూపించకుండా తమ స్వలాభాల కోసం వ్యాపారాలు, కబ్జాలు, సెటిల్మెంట్ ల కోసం తిరిగే నాయకులకు ఓటు వేయవద్దని, ప్రజల కోసం కొట్లాడుతూ తప్పుడు కేసులు మీదేసుకొని లాఠీచార్జీలు, దెబ్బలు తిని జైలు కెళ్ళి తిరిగి మళ్లీ ప్రజల కోసం కొట్లాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలనీ మీ మీ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, మోతిరామ్ నాయక్, కొత్త నరసింహులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



