- Advertisement -
నవతెలంగాణ మిడ్జిల్ : మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో ఈనెల 30వ తేదీన మండల స్థాయి సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గీతాంజలి మిడ్జిల్ సర్పంచి ఎడ్ల శంకర్ ముదిరాజ్, మండల విద్యాధికారి సరస్వతి, పిడి రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వము, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, క్రీడలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడలను విజయవంతం చేయడానికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -



