- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అత్తతో కలిసి మేనల్లుడు సొంత మేనమామను హత్య చేసిన ఘటన నల్గొండ (D) మాడ్గులపల్లి(M) సీత్యాతండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమావత్ రవి (34), లక్ష్మి భార్యాభర్తలు కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి అక్క కుమారుడు గణేశ్‌తో లక్ష్మి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై తరచు గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో రవి తలపై గాయంతో గదిలో విగతజీవిగా పడి ఉన్నాడు. లక్ష్మి గణేశ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు రవి తండ్రి లక్ష్మానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా లక్మ్షి మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.
- Advertisement -



