- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు చేరుకోవడంతో జాతర తొలి ఘట్టం పూర్తైంది. కుంకుమ భరిణ రూపంలో సారలమ్మ గద్దెలపైకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్నవాగు, మేడారం పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు.
- Advertisement -



