Thursday, January 29, 2026
E-PAPER
Homeజాతీయంపంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గ్రెనేడ్లు స్వాధీనం

పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గ్రెనేడ్లు స్వాధీనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్ సరిహద్దుల్లో పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాపై అమృత్‌సర్ రూరల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. విలేజ్ డిఫెన్స్ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 42.983 కిలోల హెరాయిన్, 4 హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక పిస్టల్, 46 లైవ్ బులెట్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. అలాగే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -