నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ గతకొంతకాలంగా పార్టీ కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ అంశంలో శశిథరూర్ పార్టీకి ప్రతికూలంగా, ఏన్డీయే కూటమికి అనుకూలంగా మాట్లాడారు. దీంతో అప్పట్నుంచి పార్టీకి దూరమవుతూ..కాంగ్రెస్ అధిష్టానంతో అట్టిముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కేరళలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కూడా శశిథరూర్ దూరంగా ఉన్నారు. అయితే తాజాగా మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో కలిసి శశిథరూర్ భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఖర్గే కార్యాలయంలో ముగ్గురు నేతలు భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలో కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతతో పాటు శశిథరూర్ వ్యవహరశైలిపై ప్రధానంగా చర్చ కొనసాగనుందని పార్టీవర్గాలు తెలిపాయి.
ఖర్గే, రాహుల్‌లతో శశిథరూర్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



