నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ – యూరప్ వాణిజ్య ఒప్పందం ( India – EU FTA)పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ప్రజల కంటే కూడా ఈరోపియన్ యూనియన్ వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ విమర్శించారు. ఈ ఒప్పందం తమను తీవ్ర నిరాశపరిచిందని తెలిపారు.
సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నామని ఈయూ ఒకవైపు చెబుతూనే.. మరోవైపు రష్యా యుద్ధాన్ని కొనసాగించేందుకు పరోక్షంగా ఆర్థికసాయం చేస్తున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ద్వారా యూరప్ దేశాలు తమ వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీట వేసినట్లు అర్థమవుతుందని అన్నారు. వాళ్లు తమకు ఏది మేలు అనిపిస్తే అది చేయాలి.. కానీ యూరప్ వైఖరి నన్ను తీవ్ర నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.



