నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం (జనవరి ) బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచారిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి.
ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులు ఎదురు పడగా పరస్పరం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టులు ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో ఎకే47 రైఫిల్, 9ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు.



