Thursday, January 29, 2026
E-PAPER
Homeకరీంనగర్రోడ్డు అంచున ప్రమాదకరంగా సిమెంట్ దిమ్మె

రోడ్డు అంచున ప్రమాదకరంగా సిమెంట్ దిమ్మె

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
మండలంలోని అల్లీపూర్ గ్రామంలో శివాజీ విగ్రహం వెనుక వైపు తారు రోడ్డును ఆనుకొని ఉన్న సిమెంట్ దిమ్మె ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు అతి సమీపంలో సిమెంట్ దిమ్మె ఉండటంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, రైతులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దిమ్మె స్పష్టంగా కనిపించక ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, రోడ్డును ఆనుకొని ఉన్న సిమెంట్ దిమ్మెను తొలగించి ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -