నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాలిటీ లోని వార్డులను అన్నింటినీ అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని ప్రజల సహకారంతో మరింత మెరుగైన మున్సిపాలిటీగా అశ్వారావుపేట ను తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ భరోసా ఇచ్చారు. ఈ నెల 11 వ తేదీన జరగనున్న అశ్వారావుపేట మున్సిపాలిటీ పోలింగ్ పురస్కరించుకొని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం గారు 22 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నార్లపాటి దివాకర్ గెలుపు కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకుని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం,మౌళిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ అంతర్గత రోడ్లు, వీధి దీపాల సమస్యలను సత్వరం పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నార్లపాటి దివాకర్ కి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఆయనే వెంట నాయకులు జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు లు పాల్గొన్నారు.



