– విజేతలు నుండి నియోజక వర్గం స్థాయికి ఎంపికలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీఎం కప్ మండల స్థాయి క్రీడలు బుధవారంతో ముగిసాయి. పెద్దవాగు ప్రాజెక్ట్ గిరిజన సంక్షేమ శాఖ బాలురు ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాల లోపు బాలురు విభాగంలో వాలీ బాల్ క్రీడల్లో అశ్వారావుపేట క్లస్టర్ విన్నర్ గాను,కావడి గుండ్ల క్లస్టర్ రన్నర్ గాను నిలిచాయి. బాలికల విభాగంలో కావడి గుండ్ల క్లస్టర్ విన్నర్ గా,అశ్వారావుపేట రన్నర్ గా నిలిచింది. ఖో ఖో క్రీడలో బాలికల విభాగంలో కావడిగుండ్ల క్లస్టర్ విన్నర్ గా,అశ్వారావుపేట రన్నర్ గా నిలిచాయి. బాలురు విభాగంలో అశ్వారావుపేట విన్నర్ గా,మామిళ్ళవారిగూడెం రన్నర్ నిలిచాయి.
కబడ్డి బాలురు విభాగంలో మామిళ్ళవారిగూడెం విన్నర్ గా,అశ్వారావుపేట రన్నర్ గా నిలిచాయి. 18 సంవత్సరాల పైబడిన వారిలో వాలీ బాల్ క్రీడల్లో బాలురు విభాగంలో కావడి గుండ్ల విన్నర్ గా,అశ్వారావుపేట రన్నర్ గా నిలిచాయి. ఖో ఖో క్రీడలో బాలికల విభాగంలో కావడి గుండ్ల విన్నర్ గా,అశ్వారావుపేట రన్నర్ గా నిలిచాయి. కబడ్డీ బాలికల విభాగంలో అశ్వారావుపేట విన్నర్ గా,కావడి గుండ్ల రన్నర్ గా నిలిచాయి. విజేతలకు తహశీల్దార్లు సీహెచ్వీ రామక్రిష్ణ,ఎంపీడీఓ అప్పారావు,ఎంఈఓ ప్రసాదరావు లు ప్రశంసా పత్రాలు,జ్ఞాపికలను అందించారు.



