‘వాల్తేర్ వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న నయా సినిమా గురువారం ఆరంభమైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులను అందించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలుగులో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది. ఇప్పటికే వరుస అప్డేట్స్‌తో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, నాగబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చారు. ఈ మెగా త్రయం వేదికను పంచుకోవడం అభిమానులకు కనులవిందు చేసింది. పవన్ కళ్యాణ్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.వి. వినాయక్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.
బి. గోపాల్, కోదండరామి రెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లోహిత్ తన బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దర్శకుడు బాబీ కొల్లి ఈసారి మరింత భారీ కథను సిద్ధం చేశారు. మ్యాసీవ్ స్కేల్, ఇంటెన్సిటీ తో నిండిన ఈ కథలో చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటించనున్నారు. చిరంజీవి నటిస్తున్న ఈ 158వ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి (శుక్రవారం) నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: బాబీ కొల్లి, నిర్మాత: వెంకట్ కె నారాయణ, సంగీతం: థమన్ ఎస్, స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి, అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి, డీఓపీ : విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: ఆంటోనీ రూబెన్, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల.
చిరు నయా సినిమా షురూ
- Advertisement -
- Advertisement -



