Friday, January 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుGlobal Technical Education: ప్రపంచ సాంకేతిక విద్యను మహిళలు అందిపుచ్చుకోవాలి

Global Technical Education: ప్రపంచ సాంకేతిక విద్యను మహిళలు అందిపుచ్చుకోవాలి

- Advertisement -

– ఉన్నత విద్యా మండలి చైర్మన్ డా. వి. బాలకిష్టారెడ్డి పిలుపు

నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్: విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘స్ట్రాటజీస్ అండ్ చాలెంజెస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా’ అనే అంశంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశం కళాశాల ప్రధానాచార్యులు డా. కె.ప్రభు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డా.వి. బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మాట్లాడుతూ…. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రెండు రోజులలో ఈ సెమినార్ లో భాగంగా మహిళా సాధికారత గురించి చర్చలు, పత్ర సమర్పణలు జరిగాయని, వీటి సారాంశం ప్రాక్టికల్ రూపంలోకి, ఆలోచనలలో మార్పు వచ్చినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అన్నట్లు అమ్మాయిలకు పూర్తిస్థాయిగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మహిళా సాధికార సాధ్యం అవుతుందనీ అన్నారు.

రిటైర్డ్ ప్రొఫెసర్ నాయుడు అశోక్ మాట్లాడుతూ.. మహిళ సాధికారతకు మొట్టమొదటిసారి కృషి చేసిన వాళ్లు మహాత్మ జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలేలని, వీరిని సమాజం ఆదర్శంగా తీసుకున్నప్పుడు మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు.

సదస్సు కన్వీనర్ డా. ఎస్. రమాదేవి మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఈ సదస్సుకు 223 పత్రాలు వచ్చాయని, మహిళా సాధికారత గురించిన అన్ని అంశాలపై పత్ర సమర్పణలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డా. వి.బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ…. మహిళలు ఆర్థిక రంగంలో సాధికారతను సాధించాలని, నాణ్యమైన విద్యను అభ్యసించాలని అన్నారు. అలాగే మహిళలకు నైపుణ్య విద్యారంగాన్ని ప్రోత్సహించాలని, రాజకీయ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలని అన్నారు. మహిళా హక్కులను గౌరవించాలని, ప్రపంచవ్యాప్తంగా వచ్చే సాంకేతికతను మహిళలకు అన్ని రంగాలలో అందించి, ప్రోత్సహించినప్పుడు మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. ఆర్. లావణ్య, పత్ర సమర్పకులు,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -