Friday, January 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపార్టీ ఫిరాయింపు ఆరోప‌ణ‌ల‌పై స్పీక‌ర్ విచార‌ణ

పార్టీ ఫిరాయింపు ఆరోప‌ణ‌ల‌పై స్పీక‌ర్ విచార‌ణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం విచారణ ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియను చేపట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను రెండు వారాల్లో తేల్చాలని సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఏడుగురిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వారు కాంగ్రెస్‌లో చేరినట్లు సరైన ఆధారాలు లేవని, సాంకేతికంగా వారంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని తన తీర్పులో పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -