Sunday, May 25, 2025
Homeప్రధాన వార్తలుప్రధాని మోడీ..అమెరికా అధ్యక్షునికిభయపడుతున్నారా?

ప్రధాని మోడీ..అమెరికా అధ్యక్షునికిభయపడుతున్నారా?

- Advertisement -

పహల్గాం ఉగ్రవాదులను
పట్టుకోవడంలో కేంద్రం విఫలం
ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేసి, శాంతి చర్చలు జరపాలి
హక్కుల కోసం సీఎం రేవంత్‌ రెడ్డి కేంద్రంతో పోరాడాలి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-కల్వకుర్తి

దేశ ప్రధాని నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షులు ట్రంప్‌నకు భయపడుతున్నారని, అందుకే ఉగ్ర వాదులవిషయంలో వెనుకడుగు వేశారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. పహల్గాం ఘటన జరిగి నెలరోజులు కావస్తున్నా ఇప్పటివరకు ఉగ్రవా దులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైంద న్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని టీఎస్‌ యూటీఎఫ్‌ భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయం లో నరేంద్రమోడీ కంటే ముందు అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ యుద్ధం ముగిసిందని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిం చారు. ఇప్పటివరకు ఈ విష యంలో ప్రధాని నోరు మెదపడం లేదన్నారు. భారతదేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనా లేదంటే ట్రంపా.. అంటూ ప్రశ్నించారు. భారతదేశంలో ఉత్పత్తి అయిన ఐఫోన్లకు అమెరికాలో 25 శాతం అదనంగా ఎక్సైజ్‌ సుంకం వేస్తామని అమెరికా అధ్యక్షులు పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ మన ప్రధాని ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు. అమెరికా అధ్యక్షునికి భయ పడటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ప్రజలం దరూ అనుకుంటున్నారన్నారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల వారిని కాల్చి చంపడం ఎంతవరకు సమం జసమని జాన్‌వెస్లీ ప్రశ్నించారు. చర్చలకు తాము సిద్ధం అంటూ మావోయిస్టులు ప్రకటించిన ప్పటికీ కేంద్రం మాత్రం ఏకపక్షంగా మావోయిస్టు లను కాల్చి చంపడం దారుణమన్నారు. ఇప్పటివరకు దాదాపు 500 మంది మావోయిస్టులను పొట్టన బెట్టుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్‌ కగార్‌ను ఆపేసి.. మావోయి స్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. మావోయిస్టులను ఉగ్రవాదుల కన్నా హీనంగా కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. వాటిని పూర్తిగా విస్మరించిందని అన్నారు. రైతు రుణమాఫీతోపాటు రైతు బీమా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.సాగర్‌, జిల్లా కార్యదర్శి పర్వతాలు, జిల్లా నాయకులు శ్రీనివాసులు, పాలాది, చింత ఆంజనేయులు, చిలుక బాల్‌ రెడ్డి, ఆంజనేయులు, పరుశరాములు, ఏపీ మల్లయ్య, బాలస్వామి, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -