Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలి.!

ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలి.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఉపాధి హామీ చట్టాన్ని సవరించి తీసుకొచ్చిన వీబీజీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు అక్కల బాపు యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కుతూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ చట్టసవరణ, విత్తన సవరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసేందుకు నిర్వహి స్తున్న ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో కార్మి కులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -