నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ వేదికగా శుక్రవారం నిర్వహించిన తెలుగ రాష్ట్రాల జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలకుపైగా సమావేశం జరిగింది. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ నీటిశాఖ అధికారులు బనకచర్ల ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎజెండా నుంచి బనకచర్లను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర అధికారులు డిమాండ్ చేశారు. అదే విధంగా సుధీర్ఘకాలంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలలతో పాటు 12 అంశాలను లెవనెత్తారు.
కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవిన్ పాటిల్, ఈఎన్సీ మహ్మద్ అంజద్ హుస్సేన్ వచ్చారు. ఏపీ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.సాయిప్రసాద్, ప్రభుత్వ సలహాదారు, ఈఎన్సీ, అంతరాష్ట్ర జలవనరుల విభాగం చీప్ ఇంజనీర్తో పాటు కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మాన్లు, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ హాజరయ్యారు.



