Sunday, May 25, 2025
Homeరాష్ట్రీయంసరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన సందర్శకులు

సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన సందర్శకులు

- Advertisement -

– భారీగా ట్రాఫిక్‌ జామ్‌
నవతెలంగాణ-మహాదేవపూర్‌

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లేందుకు సందర్శకులు పోటెత్తారు. వారాంతం కావడంతో అన్ని వాహనాలు కాళేశ్వరం వైపే మళ్లడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎనిమిది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వన్‌ వే రోడ్డు మార్గాన మండలంలోని అన్నారం క్రాస్‌రోడ్‌ నుంచి వన్‌ వే రోడ్డు మద్దులపల్లి నుంచి కాళేశ్వరం వరకు నాలుగు గంటల పాటు రోడ్డుపైనే సందర్శకులు ఇబ్బందులు పడ్డారు. మార్గమధ్యలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు కూడా కన్నెపల్లి నుంచి కాళేశ్వరంకు ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో అనేక కష్టాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీ పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్‌ చేశారు. దాంతో సందర్శకులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -