Friday, January 30, 2026
E-PAPER
HomeNews10 వ తరగతి CBSE విద్యార్థులకు ఉచిత సందేహ నివృత్తికి ఫిజిక్స్‌వాలా మాక్ ప్రీబోర్డు

10 వ తరగతి CBSE విద్యార్థులకు ఉచిత సందేహ నివృత్తికి ఫిజిక్స్‌వాలా మాక్ ప్రీబోర్డు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: 2026 లో 10 వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సహాయం చేసే లక్ష్యంతో విద్యా సంస్థ ఫిజిక్స్ వాలా (PW) ఒక విద్యార్థి మద్దతు చొరవను ప్రకటించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉచిత సందేహ నివృత్తిని, నిపుణుల మార్గదర్శకత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా పొందవచ్చు. ఇది ఫిజిక్స్ వాలా (PW) విద్యార్థులకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటుంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై విద్యా సంబంధింత ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడేందుకు అనువుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

విద్యార్థుల సంసిద్ధతను బలోపేతం చేసే ప్రయత్నంలో ఫిజిక్స్ వాలా (PW) దేశవ్యాప్తంగా సైన్స్, గణితంలో ఆఫ్‌లైన్ ప్రీబోర్డులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. నిజమైన బోర్డు పరీక్ష పరిస్థితులను అనుకరించడానికి, పరీక్ష జరిగే రోజుల్లోని పరిమితుల్లో విద్యార్థులు నైపుణ్యం, సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటానికి ఈ పరీక్షలు ఫిజిక్స్ వాలా (PW) భౌతిక కేంద్రాలలో విద్యాపీఠ్, పాఠశాల, ట్యూషన్ సెంటర్లలో నిర్వహిస్తారు.

విద్యాపీఠ్ఆఫ్‌లైన్ ఆఫ్ ఫిజిక్స్ వాలా (PW) సీఈఓ అంకిత్ గుప్తా మాట్లాడుతూ, ‘‘ఒక విద్యార్థి బోర్డు పరీక్షల వంటి నిర్ణయాత్మక క్షణానికి సిద్ధమవుతున్నప్పుడు, విద్యను ఎప్పుడూ సరిహద్దులతో పరిమితం చేయకూడదు. చాలా మంది విద్యార్థులకు నాణ్యమైన పరీక్ష మద్దతు వెంటనే అందుబాటులో ఉండదు. పరిష్కరించబడని ఒక్క సందేహం కూడా ఒత్తిడికి కారణమవుతుందని మాకు తెలుసు. ప్రతి విద్యార్థికి మా విద్యాపీఠ్, పాఠశాల, ట్యూషన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, వారు మాతో చేరారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మేము విద్యార్థి సమాజానికి సరైన రీతిలో సహకారాన్ని అందిస్తున్నాము. అభ్యర్థులు మద్దతు, నమ్మకం, వారి పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము’’ అని తెలిపారు.

భారతదేశం అంతటా విద్యార్థులు బోర్డు పరీక్షల వరకు చెల్లుబాటు అయ్యే డౌట్ బస్టర్ పాస్ పొందడానికి వారి సమీపంలోని ఫిజిక్స్ వాలా (PW) విద్యాపీఠ్, పాఠశాల లేదా ట్యూషన్ సెంటర్‌ను సందర్శించవచ్చు అలాగే, సందేహ నివృత్తి కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు నిర్దిష్ట ప్రశ్నలను సంప్రదిస్తారు. సంక్లిష్టమైన అంశాలను వివరిస్తూ, సమాధాన-రచన పద్ధతులపై వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. విద్యార్థులు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, జీవశాస్త్రం వంటి అంశాలలో సందేహాలను స్పష్టం చేసుకోవచ్చు. వారి తయారీకి అనుగుణంగా సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి సిలబస్ కోసం రివిజన్ కార్డులను కూడా పొందవచ్చు. విద్యార్థులు ఫిజిక్స్ వాలా (PW) యాప్ ద్వారా ఫిబ్రవరి 1, 2026న నిర్వహించే సైన్స్ పరీక్ష, ఫిబ్రవరి 8, 2026న నిర్వహించే గణిత పరీక్ష కోసం తమ సమీప కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

సెప్టెంబరు 30, 2025 నాటికి భారతదేశంలోని 132 నగరాల్లో ఉన్న ఫిజిక్స్‌వాలా 192 టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్, పాఠశాల కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -